లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

టన్ను ఉపదేశాలకంటే… ఔన్సు ప్రాక్టీస్ విలువైనది

Published

on

PM Modi speaks at UNSG's Summit on Climate Change: We believe that an ounce of practice is worth more than a ton of preaching

ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న  మోడీ ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని వాతావరణ మార్పు అంశంపై ప్రసంగించారు. భారత్ లో మిలియన్ల కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ కనెక్షన్లను తాము అందించామని ఆయన తెలిపారు.

నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ,వర్షపు నీటి సేకరణ కోసం ‘జల్ జీవన్’ మిషన్ ప్రారంభించామన్నారు. ఈ ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా… సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి స్వేచ్ఛ పొందాలని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో సింగిల్ యూజ్ వాడకం ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా అవగాహన పెంచుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. మాట్లాడే సమయం ముగిసిందని…ప్రపంచం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *