Published
2 months agoon
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. టీకా ప్రసంగంలో రెండు తెలుగు సామెతలను ప్రధాని ప్రస్తావించడం విశేషం. దేశ మంటే మట్టికాదోయ్..దేశ మంటే..మనుషులోయ్..సొంత లాభం మానుకో.. గట్టిమేలు తలవెట్టవోయ్..గురజాడ చెప్పిన పద్యాన్ని గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు.
వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియచేస్తున్నానని, పగలు రాత్రి శ్రమించిన అందరికీ కృతజ్ఞతలు తెలిచేశారాయన. శాస్త్రవేత్తలు పండుగ కూడా చేసుకోకుండా..మన కోసం కష్టపడ్డారని చెప్పారు. ఒకటి కాదు..రెండు వ్యాక్సిన్ లు వచ్చాయి..అదీ మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఇవే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్ లు కూడా వస్తున్నాయని, దేశీయ వ్యాక్సిన్ తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియచేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డ్రైరన్స్, ట్రయల రన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయన్నారు.
మనం తయారు చేసిన వ్యాక్సిన్లపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకముందని, ప్రపంచంలో వంద దేశాలలో జనాభా 3 కోట్ల లోపేనని..ఒక్క భారతదేశంలోనే జనాభా 130 కోట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం 3 కోట్ల మందికే వ్యాక్సిన్..దీనిని 30 కోట్లకు తీసుకెళుతామన్నారు. 30 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేది ఇండియా, చైనా, అమెరికా మాత్రమేనని, ఇంకా ఏ దేశం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు: కేటీఆర్ విమర్శలు
దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు
హైదరాబాద్లో ఉంటున్నారా? కరోనా వచ్చినట్లే!
ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 102 మందికి పాజిటివ్
కరోనా కల్లోలం, భారత్లో మళ్లీ భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు