లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ..?

Published

on

pm modi ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర మంత్రులను, జాతీయ నాయకులను గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలోకి దింపుతోంది. ఢిల్లీ నేతలను గల్లీకి రప్పిస్తోంది బీజేపీ. ఈ క్రమంలో బీజేపీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు 15మంది కేంద్ర మంత్రులు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ నేతలు హైదరాబాద్ తీసుకొస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రచారానికి ప్రధాని మోడీ కూడా వస్తున్నట్టు తెలుస్తోందని కేటీఆర్ అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని?


హైదరాబాద్ జలవిహార్ లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. త్వరలోనే గండిపేటను మించిన చెరువుని నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. అలాగే నగరంలో మరోసారి వరద సమస్య రాకుండా నాలాలను అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశ ద్రోహులు, దేశ భక్తులకు జరుగుతున్న ఎన్నికలు అంటున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం 2లక్షల 72వేల కోట్లు ఇస్తే.. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం లక్షా 40వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ నిధులను కేంద్రం వివిధ రాష్ట్రాలకు పంచుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ దేశం బాకీ పడిందన్నారు కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే ఒకరు రూ.25వేలు, మరొకరు రూ.50వేలు ఇస్తామంటున్నారు.. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం చెప్పరు అని కేటీఆర్ అన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కేంద్రం 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్న కేటీఆర్.. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో, ఎవరికిచ్చారో తెలియదన్నారు. హైదరాబాద్ లో చిచ్చుపెట్టేలా ప్రజలను రెచ్చగొడ్డుతున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు కేసీఆర్.

కరెంట్, నీళ్లు, భద్రత, అభివృద్ధిపై చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు. తాగునీటి సరఫరాను గతంలో కంటే మెరుగుపర్చుకున్నామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ కోసం తాగునీటి రిజర్వాయర్ కట్టాలని గత పాలకులు ఆలోచించ లేదన్నారు. ఏడాది లోపు రిజర్వాయర్ పూర్తి చేసి నగరానికి రోజూ నీళ్లు అందిస్తామన్నారు కేటీఆర్. నెలకు 20వేల లీటర్ల లోపు నీళ్లు వాడుకునే వారు ఇక నుంచి నల్లా బిల్లు కట్టే అవసరం లేదన్నారు కేటీఆర్. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రజలకు ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పడం లేదన్నారు కేటీఆర్. మేం ఏం చేశామో చెబుతున్నాం అలాగే బీజేపీ ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ అడిగారు. మనం రూపాయి ఇస్తే వారు అర్థరూపాయి ఇస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాల అభివృద్ధికి వాడుతున్న డబ్బులో తెలంగాణ వాటా ఉందన్నారు కేటీఆర్. బీజేపీ వాళ్లు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం సంగతేమో కానీ ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారని కేటీఆర్ వాపోయారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *