లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్న మోడీ

Published

on

PM Modi శుక్రవారం(జనవరి-22,2021) మధ్యాహ్నాం 1:15గంటలకు ప్రధాని మోడీ.. తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా మాట్లాడనున్న మోడీ.. వారి అనుభవాలను అడిగి తెలుసుకోన్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్ ద్వారా తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను వినే అవకాశం దీని ద్వారా కలుగనుందని ప్రధానమంత్రి తెలిపారు. రేపటి సమావేశాన్ని అందరూ చూడాలని మోడీ కోరారు. కాగా, వ్యాక్సిన్ లబ్ధిదారులతో సంభాషణ అనంతరం.. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులతో మోడీ.. వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమంపై చర్చించనున్నారు.

కాగా, భారత్​.. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద టీకా డ్రైవ్​ను​ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా ఈ వ్యాక్సిన్ డ్రైవ్​ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గురువారం(జనవరి-21,2020)సాయంత్రం 6గంటల సమయానికి 9,99,065 మంది ఆరోగ్యకార్యకర్తలకు కోవిడ్-19 వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలోని ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికమని తెలిపింది.

ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,611,719కి చేరింది. మరణాల సంఖ్య 152,906గా ఉంది. ఇక కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 10,265,706గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,92,208గా ఉంది. ఇక తాజాగా బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా కేసుల సంఖ్య భారత్ లో 145కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.