లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సీతాకోక చిలుకల్ని ఎగురవేసిన ప్రధాని : పుట్టినరోజున బిజీ బిజీగా మోడీ

Published

on

PM Narendra Modi at the Butterfly Garden in Kevadiya, Gujarat

ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టినరోజు వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకుంటున్నారు. మోడీ పుట్టిన రోజున రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని  గుజరాత్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీంట్లో భాగంగా మోడీ నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ ను సందర్శించారు. అనంతరం కాటన్ బ్యాగ్ లో ఉన్న సీతాకోకచిలుకలు గాల్లోకి ఎగురవేశారు. ఈ దృశ్యం కనువిందు చేసింది.  తరువాత ప్రధాని కాక్టస్ గార్డెన్‌కు (ఎడారి మొక్కలు ఉన్న గార్డెన్) ను కూడా సందర్శించారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు. 

అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు. డ్యామ్‌పై పూజలు చేశారు.నర్మదా నదికి ప్రధాని హారతి ఇచ్చారు. నర్మదా పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును పరిశీలించారు. వాటి తయారు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో ఆయన వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీతోపాటు గవర్నర్ ఆచార్య దేవ్ రాత్ ఉన్నారు. తన 69వ పుట్టినరోజు సందర్భంగా మోడీ గురుదేశ్వర్ దత్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *