లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

ఆత్మపరిశీలనకు సమయం కేటాయించండి

Published

on

Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్​ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.డిజిటల్​ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. అయితే తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. దీని వల్ల సామర్థ్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.బుధవారం లఖ్​నవూ విశ్వవిద్యాలయం 100ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంప్​తో పాటు 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారు మోడీ.ఈ సందర్భంగా స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు రూపొందించాలని మోడీ సలహా ఇచ్చారు. స్థానిక నైపుణ్యాన్ని విశ్లేషించి, స్థానిక వస్తువుల కోసం వర్సిటీ ఓ కోర్సును ఎందుకు రూపొందించకూడదు? తన పరిధిలోని జిల్లాల్లో వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకు కృషి చేయకూడదు? స్థానిక వస్తువులపై వర్సిటీ పరిశోధన చేయవచ్చు. ఓ స్థానిక వస్తువుకు సంబంధించి.. బ్రాండ్​, మార్కెటింగ్​, ఇతర వ్యూహాలపై ఓ కోర్సు ఉంటే బాగుంటుందని మోడీ అన్నారు.కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానం.. ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉద్దేశించినదని ప్రధాని పేర్కొన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *