లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

మోడీ తమిళనాడును కంట్రోల్ చేయడానికి కేంద్ర బలగాలను వాడుకుంటున్నారు: రాహుల్ గాంధీ

Updated On - 8:03 pm, Sat, 23 January 21

Tamil Nadu Rahul Gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ తమిళనాడు భాష, నేపథ్యం, సంస్కృతి, చరిత్ర గురించి పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తో తమిళనాడును కంట్రోల్ చేస్తున్నారు. అని కొయంబత్తూర్ వేదికగా జరిగిన రోడ్ షోలో మాట్లాడారు. అతని తండ్రి, నాయనమ్మకు తమిళనాడుతో ఉన్న సంబంధం గురించి చెప్పుకొచ్చారు.

ఢిల్లీ నుంచి పాలిస్తున్న గవర్నమెంట్.. తమిళ కల్చర్, భాష, చరిత్ర గురించి పట్టించుకోవడం లేదు. ప్రధాని కేవలం ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఐడియాతో ఉండాలనుకుంటున్నాడు. ప్రధాని నమ్మకం ప్రకారం.. ఇండియా మొత్తం కేవలం నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నారు. అంతేకానీ తమిళనాడులో ఉన్న స్పిరిట్ ను అర్థం చేసుకోలేకపోతున్నారు.

తమిళ ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు అక్కడికి వచ్చినట్లు కాంగ్రెస్ లీడర్ చెప్పారు. దాంతోపాటు కేంద్రం తీసుకొచ్చిన డీమానిటైజేషన్, జీఎస్టీ లాంటి సేవలు రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సమస్యగా మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదారుగురు పారిశ్రామికవేత్తల గురించేపనిచేస్తుందన్నారు.

‘తమిళనాడు సాధారణంగా.. పారిశ్రామికోభివృద్ధికి చిహ్నంగా మాట్లాడుకునేవాళ్లం. దురదృష్టవశాత్తు ఇవాళ ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో కలిసి మాట్లాడాను. డీమానిటైజేషన్, జీఎస్టీ వల్ల వాళ్లకి జరిగిన నష్టం గురించి చెప్పారు. నరేంద్ర మోడీ చేసిన ప్రతి పని ఎమ్ఎస్ఎమ్ఈ సెక్టార్ ను దెబ్బతీసేందుకే అన్నట్లు ఉంది.

రైతులకు, ఎమ్ఎస్ఎమ్ఈ, శ్రామికులకు చేయాల్సింది ఐదారుగురు పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే చేస్తున్నారు. దానిని మేం ఒప్పుకోం. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ ఇవాళ కాంప్రమైజ్ అయిపోయింది. తనకు కావాల్సిన చోట సీబీఐ, ఈడీ శాఖలను పీఎం మోడీ వాడుకుంటున్నారు. అలా తమిళనాడు గవర్నమెంట్ ను కంట్రోల్ చేస్తున్నామని ఆయన అనుకుంటున్నారు. అలా ప్రజలను అదుపులోకి తెచ్చుకోవాలని ప్లాన్చేస్తున్నారు. తమిళనాడు భవిష్యత్ లో మరో నాగ్‌పూర్ అవడానికి వీల్లేదు.

నాకు తమిళనాడుతో రాజకీయ సంబంధం లేదు. నాకు ఈ రాష్ట్రంతో కుటుంబపరమైన సంబంధం ఉంది. రక్త సంబంధం ఉంది. ఓ కుటుంబ సభ్యుడిగానే ఇక్కడకు వచ్చా. మీ నుంచి ఏదీ ఆశించడం లేదు. మీ ప్రేమ, అభిమానం మాత్రమే నాకు కావాలి. నా సెంటిమెంట్ ఎంత స్వచ్ఛంగా, నిజాయతీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరు మా నాయనమ్మ, తండ్రి పట్ల ఎంత ప్రేమపూర్వకమైన రిలేషన్ తో ఉండేవారో తెలుసు. అది నాకు కూడా కావాలి. నాకు ఇచ్చిన ప్రేమను తిరిగి ఇచ్చేస్తా. తమిళనాడుకు మరో సారి సహాయసహకారం అందించాలనుకుంటున్నా’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.

తమిళనాడులోని పశ్చిమ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ ఈ మాటలు మాట్లాడారు. రైతులతో, నేత కార్మికులతో సాధారణ ప్రజానీకంతో కలిసి చర్చించారు. తిరుప్పూర్, ఎరోడె, కరూర్, దిండిగల్ జిల్లాల్లో జనవరి 23నుంచి 25వరకూ పర్యటించనున్నారు.