లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

Poco M2 Pro..నేడే సేల్..విశేషాలు ఇవే

Published

on

Poco M2 Pro సేల్స్ అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. జులై 14వ తేదీ మంగళవారం నాడు జరిగే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

నాలుగు కెమెరాల సెటప్, ఆక్టాకోర్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఇందులో అందించనున్నట్లు Poco సంస్థ వెల్లడించింది. వీటిలో 4 GB RAM + 64 GB STORAGE వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు.

6 GB RAM + 64 GB STORAGE వేరియంట్ ధర రూ.14,999, 6 GB RAM + 128 GB STORAGE వేరియంట్ ధర రూ.16,999 ఉంది. అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

Flpkart ద్వారా 12 గంటలకు సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఇందులో డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. Axis Bank ద్వారా కొనుగోలు చేస్తే..5 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. Axis Bank Buzz credit card ద్వారా కొనుగోలు చేస్తే..5 శాతం డిస్కౌంట్ లభించనుంది. 12 నెలల వరకు no-cost EMI సదుపాయం కూడా ఉంది.

Poco M2 Pro specifications :-
6.67 అంగుళాల inch full-HD+ (1,080×2,400 pixels), display with 20:9 aspect ratio, డ్యూయల్ సిమ్ (Nano) Poco M2, ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్, నాలుగు కెమెరాలున్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 megapixel primary sensor, 8-megapixel secondary sensor, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 megapixel మాక్రో షూటర్, సెల్ఫీల కోసం 16 megapixel shooter కెమెరాను ముందువైపు అందించారు.
5000 MH బ్యాటరీ. 33W Fast Charging టెక్నాలజీ ఉంది. Android 10 MIUI 11 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 4G, WIFI, BLUETOOTH 5.0, GPS/A-GPS, USB Type C Port కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *