Updated On - 8:25 pm, Wed, 20 January 21
Pogaru: ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు.. నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ‘పొగరు’ మూవీలోని సాంగ్‌ని ఎవరూ మర్చిపోలేరు. కన్నడలో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‌తో రికార్డులు సాధించింది.
యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’.. తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కారణంగా చాలా మంది తెలుగు రైట్స్ కోసం పోటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.
ఫ్యాన్సీ రేటుకి ధృవ సర్జా ‘పొగరు’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత డి.ప్రతాప్‌రాజు..
ఫిబ్రవరి 19న ‘పొగరు’ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే.. డబ్ల్యూడబ్ల్యూలో ఫేమస్ ఫైటర్స్.. కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్లు విలన్స్‌గా నటిండం విశేషం. ఈ నలుగురు బాడీ బిల్డర్స్‌కి, ధృవ సర్జాకి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయంటున్నారు మూవీ టీమ్..