Home » త్వరలోనే…పీవోకేపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుంది
Published
1 year agoon
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్నారు. అంతర్గత సమస్యలపై భారతదేశం విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత దేశ అంతర్గత వ్యవహారమన్నారు.
ఇకపై పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే, అవి పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)పైనే జరుగుతాయని సృష్టం చేశారు. ఇరుగు పొరుగు దేశాలతో భారత దేశం సత్సంబంధాలను కోరుకుంటోందన్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారిందని ఆరోపించారు. పాక్ ఉగ్రవాదంపై పోరాడాలని చెప్పారు. సరిహద్దులను దాటే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ ను కోరారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడే అవకాశం వస్తే ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్నారు.
అమెరికాలో ప్రధాని మోడీ పాల్గొనే ‘హౌడీ, మోడీ’ కార్యక్రమానికి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాబోతుండటాన్నిబట్టి భారతీయులకు లభిస్తున్న గౌరవం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. జీ20, బ్రిక్స్ వంటి వేదికలపై భారత దేశ గళానికి, భారతీయ అభిప్రాయాలకు గతంలో కన్నా ఎక్కువగా మన్నన దక్కుతోందని చెప్పారు. లక్ష్య సాధనకు కలిసికట్టుగా పనిచేయడం భారత దేశ విదేశాంగ విధానంలో అత్యంత కీలకంగా మారిందని జైశంకర్ అన్నారు. దేశ భద్రత, విదేశాంగ విధానం మధ్య అనుసంధానం, దేశ భద్రత లక్ష్యాలు, విదేశాంగ విధానం లక్ష్యాల మధ్య సంబంధం పటిష్టంగా వృద్ధి చెందుతున్నట్లు జై శంకర్ తెలిపారు.
EAM S. Jaishankar: On what happens, if or when, whatever…, I meet the Pakistani Foreign Minister on the sidelines of UNGA. We will see when that happens. pic.twitter.com/uaEc7bsbHJ
— ANI (@ANI) September 17, 2019