లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

అన్నదాతల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు..ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులకు అనుమతి

Published

on

police allowed Farmers : ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల ఛలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢిల్లీ పోలీసులు షరతు విధించారు.ఢిల్లీ సరిహద్దులోని సింఘు ప్రాంతంలో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, రైతులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక దశలో రైతులను అడ్డుకునేందుకు పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతాబలగాలు రైతులను అడ్డుకున్నాయి. రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసినా రైతుల వెనక్కి తగ్గలేదు.టిక్రి సరిహద్దుల్లో రైతులపై లాఠీఛార్జ్ చేశారు. సింఘు, శంభు సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. రెండు రోజులుగా ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతులు ఆందోళన చేపట్టారు. రైతు సంఘాలు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రామ్ లీలా మైదానంలోకి అనుమతించాలని కోరాయి.

ఈ పరిణామాల అనంతరం పోలీసులు రైతులకు అనుమతినిచ్చారు. పోలీసులు అనుమతించడంతో ఇప్పటికే 5 వేల మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. వీరంతా రామ్ లీలా మైదానంలో నిరసన చేపట్టనున్నారు.అయితే ప్రభుత్వం అనుమతించినా పలు చోట్ల ఇంకా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నీరు, ఆహారం సరఫరా చేసే ట్రాక్టర్లను మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు ఢిల్లీ పోలీసులు ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో వారిని కట్టడి చేసేందుకు ఇదొక్కటే మార్గమంటున్నారు ఢిల్లీ పోలీసులు.అంతకముందు కరోనా ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీకి యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్, హర్యానా రైతులు తరలొస్తున్నారు. వీరంతా రామ్ లీలా మైదానానికి చేరుకుని ఆందోళన తెలిపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆందోళనలో 500 రైతు సంఘాలు పాల్గొంటున్నాయని వారు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *