లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

పెళ్లైన మహిళలే వీడి టార్గెట్, 50మందిని నగ్నంగా వీడియో తీసి దొరికి పోయాడు

ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్

Published

on

police arrest btech student who captured women bath video

ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్

ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్ సమయంలో అతడిలో కామ కోరికలు కట్టలు తెంచుకున్నాయి. ఇంటి పక్కన ఉండే ఆంటీలపై ఆ నీచుడి కన్ను పడింది. కామవాంఛతో రగిలిపోతూ వివాహితలపై వేధింపులకు పాల్పడ్డాడు. మహిళలు స్నానం చేస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాతో వీడియో తీయడం, తన కోరిక తీర్చాలని వారిని బెదిరించడం. ఇదీ ఆ బీటెక్ కుర్రాడి బాగోతం. చివరికి అతడి పాపం పండింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అత్తారింటికి పంపారు.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా పుదుమఠంకు చెందిన శివకుమార్‌ బీటెక్ చదువుతున్నాడు. లాక్‌‌డౌన్ కారణంగా కాలేజీకి సెలవులు ప్రకటించడంతో కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే వివాహితపై అతడి కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తన ఇంజినీరింగ్ బుర్రను ఉపయోగించి డ్రోన్ కెమెరా సిద్ధం చేశాడు. ఆ మహిళ స్నానానికి వెళ్లిన సమయంలో డ్రోన్‌ సాయంతో వీడియో తీశాడు.

ఆ తర్వాత ఆమె వాట్సాప్ నంబర్ తెలుసుకుని ఆ బాత్ వీడియోను ఆమెకు పంపించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శివకుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పోలీసులకు మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. శివకుమార్ గతంలోనూ ఇలాగే కాలనీలోని మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధించినట్లు తేలింది. సుమారు 50 మందిని ఇదే విధంగా బెదిరించి లోబరుచుకున్నట్లు తెలిసి కంగుతిన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *