లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

బాలుడి టీషర్ట్‌తోనే చంపేశాడు, ఏ అప్లికేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయో గుర్తించేందుకు 3 రోజులు పట్టింది, మీడియా ముందుకు దీక్షిత్ హంతకుడు

Published

on

deekshith reddy kidnap murder case: మహబూబాబాద్ 9ఏళ్ల చిన్నారి దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నిందితుడు మంద సాగర్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు మంద సాగర్ ను శుక్రవారం(అక్టోబర్ 23,2020) పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కిడ్నాప్, హత్య కేసు వివరాలను ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. అక్టోబర్ 18న సాయంత్రం 5.30 గంటలకు పథకం ప్రకారం
మంద సాగర్ బాలుడు దీక్షిత్ ని కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.
బాలుడిని బైక్ పై ఎక్కించుకున్న సాగర్, సీసీ కెమెరాలకు దొరక్కుండా దానవయ్య గుట్టకు తీసుకెళ్లాడని చెప్పారు. గుట్టపైకి తీసుకెళ్లడంతో భయపడిన దీక్షిత్ తనను ఇంటికి తీసుకెళ్లమని ఏడ్చాడు. దీక్షిత్ ఏడవడంతో తన బండారం బయటపడుతుందని భయపడ్డ మంద సాగర్, దీక్షిత్ కి నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆ తర్వాత దీక్షిత్ చేతులు కట్టేసి బాలుడి టీషర్ట్ తోనే మెడకు ఉరేసి హత మార్చాడని ఎస్పీ చెప్పారు. బాలుడిని చంపిన తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా చేసేందుకు పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడని ఎస్పీ చెప్పారు. దీక్షిత్ ను చంపిన తర్వాత రూ.45లక్షలు ఇవ్వాలని బాలుడి తల్లికి నిందితుడు సాగర్ గుట్టపై నుంచే ఫోన్ చేశాడని చెప్పారు. ప్రత్యేక ఇంటర్ నెట్ అప్లికేషన్ ఉపయోగించి నిందితులు కాల్స్ చేశాడన్నారు.

అసలు దీక్షిత్‌ను సాగర్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎందుకు చంపేశాడు? ఎలా దొరికిపోయాడు?


దేశంలోని టెలికాం సర్వీసుల ప్రమేయం లేకుండానే ఇంటర్ నెట్ కాల్స్ చేశాడని చెప్పారు. నిందితుడిని గుర్తించడానికి హైదరాబాద్, వరంగల్ సైబర్ క్రైమ్, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ టీమ్ లు పని చేశాయని ఎస్పీ తెలిపారు. విదేశాల అప్లికేషన్లతో వచ్చిన కాల్స్ ను గుర్తించేందుకు 3 రోజుల సమయం పట్టిందన్నారు. బాలుడి తండ్రి ఆర్థికంగా బలంగా ఉన్నాడని తెలుసుకునే నిందితుడు సాగర్ దుశ్చర్యకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *