police arrest serial killer simhadri

ప్రసాదంలో సైనేడ్ కలిపి 10మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్‌ సింహాద్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్‌

పశ్చిమగోదావరి జిల్లాలో సీరియల్ కిల్లర్‌ సింహాద్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 మందిని హత్య చేశాడు సింహాద్రి. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసాదంలో సైనేడ్‌ కలిపి 10 మందిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రంగురాళ్లు, గుప్తనిధుల పేరుతో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడాడు. జనం నుంచి 28 లక్షల రూపాయలకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

సింహాద్రితో పాటు సైనేడ్‌ సరఫరా చేసిన షేక్‌ అమీనుల్లాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింహాద్రి నుంచి సైనేడ్‌, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సింహాద్రి తన బంధువులు, కుటుంబసభ్యులనూ హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య కేసు విచారణలో సింహాద్రి పేరు బయటకి వచ్చింది. అక్టోబర్ 16న నాగరాజు హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ప్రసాదంలో సైనేడ్ కలిపి నాగరాజును హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సింహాద్రి చేసిన అనేక ఆకృత్యాలను పోలీసులు తెలుసుకున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 10 మందికి సైనేడ్ కలిపిన ప్రసాదం పెట్టి అతను హతమార్చినట్లు విచారణలో తేలింది.

అక్టోబర్‌ 18న రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని కాటి నాగరాజు బైక్ పై వెళ్లారు. ఆభరణాలు ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే ఎల్‌ఐసీ వాళ్లు స్కాన్‌ చేసుకుని ఇస్తారని చెప్పారని భార్య తెలిపారు. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్‌ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. ఇది గమనించి కానిస్టేబుల్.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తొలుత నాగరాజు గుండెపోటుతో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆయన దగ్గర ఉండాల్సిన నగదు, నగలు లేకపోవటాన్ని గుర్తించారు. ఇది హత్య అనే అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ క్రమంలో సీరియల్ కిల్లర్ సింహాద్రి పేరు వెలుగులోకి వచ్చింది.

Related Posts