Police Arrested 2 Man While Carrying Baby in Bag at Jubilee Bus Station

జూబ్లి బస్టాండు వద్ద కలకలం : బ్యాగులో కళ్లు తెరవని పసికందు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జూబ్లి బస్టాండు వద్ద కలకలం రేగింది. కళ్లు తెరవని పసికందు బ్యాగులో లభ్యమైంది. ఈ ఘటన 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇది బయటపడింది. కానీ ఆ పసికందు ఎవరు ? ఎందుకు బ్యాగులో పెట్టారు ? తల్లిదండ్రులు ఎవరు ? అనేది తెలవడం లేదు. పోలీసుల విచారణలో బయటపడనుంది. వివరాల్లోకి వెళితే..

ఉదయం 9 గంటలకు జూబ్లి బస్టాండు ప్రాంతం బస్సుల రాకపోకలు, ప్రయాణీకులతో సందడిగా ఉంది. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారి చేతుల్లో ఓ బ్యాగు కూడా ఉంది. వీరిపై ఓ ఆటో డ్రైవర్‌కు డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడకు రావడంతో ఆ ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశఆరు. బస్టాండు వెనుకనున్న ఖాళీ ప్రదేశంలో ఓ చెట్టు వెనుక నక్కారు. పోలీసులు వారిని పట్టుకున్నారు.

బ్యాగు తెరిచి చూడగా..అందులో కళ్లు తెరవని పసికందు చూసి షాక్ తిన్నారు. పాప ఎవరిది ? ఎక్కడకు తీసుకెళుతున్నారు ? అసలు బ్యాగులో ఎందుకు పెట్టారు ? తదితర ప్రశ్నలు అడిగారు. కానీ వారు పొంతన లేని సమాధానమిచ్చారు. పాప తమ మనవరాలని, చనిపోయిందని చెప్పారు. అయితే ఆ పాప బతికే ఉండడంతో.. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాపను గాంధీ ఆస్పత్రికి తరలించారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 
Read More : ESI IMS స్కామ్‌ : రూ. 3 కోట్ల బంగారం కొన్న దేవికారాణి

Related Posts