లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పాపం పండింది – భర్తను హత్య చేస్తుండగా చూసిన కొడుకు

Published

on

police arrested wife and her lover, due to husband murder : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో ఇల్లాలు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యచేసుకున్నాడని అందరినీ నమ్మించింది. నిజమని నమ్మిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

హమ్మయ్యా అంతా సజావుగా సాగిపోయింది, ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటుండగా కన్న కొడుకు బాంబు పేల్చాడు. తన తండ్రిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హతమార్చినట్లు చెప్పాడు. దీంతో బండారం బయటపడి కటకటాలపాలైంది.

నల్గోండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో జనవరి 8న ఈ ఘటన జరిగింది. హత్య జరిగిన తర్వాత మృతుడి కుమారుడు తన తాతకు విషయం చెప్పటంతో ఈ నిజం వెలుగు చూసింది. మృతుడి తండ్రిపిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.