కలికాలం !….గే సెక్స్ కోసం వెళ్లి బుక్కయిన బ్యాంకు ఉద్యోగి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మగోళ్లందరూ ఒకలా ఉండరు….అందరికీ ఆడోళ్లమీద పిచ్చి ఉండదు. అలాగే ఆడవాళ్లు అందరూ మగవాళ్ల కోసం వెంపర్లాడరు. సమాజంలో “గే”, లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్ తో సెక్స్ చేసే వాళ్లు ఉంటారు. ఎవరికి నచ్చిన వారితో వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధానాన్ని సభ్య సమాజం హర్షించదు. ఇలాంటి వింత కోరికతో ఉన్న బ్యాంకు అధికారి ‘ గే ‘ సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. సెప్టెంబర్ 7 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ వనస్ధలిపురం యూనియన్ బ్యాంకు లో పనిచేసే ఓ అధికారి గే సెక్స్ కు అలవాటు పడ్డాడు. ఆన్ లైన్ చాటింగ్ లో పరిచయం అయిన ఒక వ్యక్తితో చాట్ చేసి తన కోరిక తీర్చుకోటానికి రూ. 5వేలకు విటుడ్ని బుక్ చేసుకున్నాడు.విటుడ్ని కలిసేందుకు సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో ఎస్.ఆర్.నగర్ లో విటుడు ఉండే ఏరియాకు వచ్చాడు. విటుడు చెప్పిన ఇంట్లోకి వెళ్లాడు. విటుడు మొదటి అంతస్తులో ఉంటున్నానని చెప్పగా మెట్లెక్కి పైకి వెళ్లాడు. అక్కడ విటుడ్ని చూడగానే బ్యాంకు ఆఫీసర్ ఉత్సాహం కాస్తా నీరు కారిపోయింది. విటుడు దివ్యాంగుడు అవటంతో ఆఫీసర్ కు నచ్చలేదు. బ్యాంకు ఆఫీసర్ వెను దిరిగాడు.

ముందు మాట్లాడుకున్న విధంగా డబ్బులివ్వాల్సిందేనని విటుడు పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారు ఝామున మంచి నీళ్లు పట్టుకోటానికి బయటకు వచ్చిన మహిళలు ఈ గొడవ చూసారు. దొంగేమోనని అనుమానించి బ్యాంకు ఆఫీసరును బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడుకు వచ్చిన పోలీసులు విషయం తెలుసుకున్నారు. వికలాంగ విటుడిని, బ్యాంకు ఆఫీసర్ ను అరెస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related Posts