లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వీరులారా వందనం : పోలీసు ఉద్యోగాలకు డిసెంబర్ లో నోటిఫికేషన్ – సీఎం జగన్

Published

on

cm jagan announces police recruitment notification : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని, నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు.అంతేగాకుండా..పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామన్నారు. 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అధికారంలోకి వచ్చినా ఏం లాభం, తీవ్ర నిరాశలో వైసీపీ నేతలు


నేరం చేసిన ఎవరినైనా సరే..వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని, సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని ఖరాఖండిగా చెప్పారు. పోలీసు అమరవీరుల స్మరించుకొనే రోజు అని, వీరు ఎన్నో అమూల్యమైన సేవలందించారని కొనియాడారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించామని,రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చామని గుర్తు చేశారు. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించినట్లు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు.

అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. పోలీస్ సేవా యాప్‌ కూడా తీసుకొచ్చామని, పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *