భార్యను నదిలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరణ… పోలీసు తెలివి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూణాళ్లకే పెళ్లా మంటే మొహం మొత్తింది. పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. విడాకులివ్వకుండా పూర్తిగా ఆమెను దూరం చేయాలనుకున్నాడు. పోలీసోడు కదా…. హత్య చేస్తే దొరికి పోతామని తెలుసు… ఏంచేయాలా అని ఆలోచించాడు. ఇటీవల కురిసిన వర్షాలు కలిసొచ్చాయి. నదిలో తోసేసాడు..కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడింది ఆ ఇల్లాలు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన పత్తి భాస్కర్ హైదరాబాద్లోని ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. హైదరాబాద్ లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న రామలక్ష్మి అనే అనాధ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. తర్వాతి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి. దీంతో భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. పోలీసు బుర్ర ఉపయోగించాడు. నేరం తన మీదకు రాకూడదు, సహజ మరణంగా ఐనా ఉండాలి, ప్రమాదవశాత్తు అయినా ఉండాలి అనుకున్నాడు. ఇటీవల కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రాల్లోని నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి.

సెప్టెంబర్ 16న భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు. 21వ తేదీ సోమవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళదామని చెప్పి ఆమెను తీసుకుని బైక్ పై బయలుదేరాడు. గ్రామ సమీపంలోని కుందూ నది వంతెన పైకి చేరుకున్నతర్వాత బైక్ ఆపాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను నదిలోకి తోసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు….తను కూడా బైక్ తో సహా నదిలోకి దూకాడు.తనకు ఈత రావటంతో కొంత దూరం ఈది ఒడ్డుకు చేరుకున్నాడు. కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదిలో పడిన రామలక్ష్మి కేకలు వేస్తూ నాలుగు కిలోమీటర్లు కొట్టుకు వెళ్లింది. ఇది గమనించిన కొందరు రైతులు నదిలోకి దూకి రామలక్ష్మిని రక్షించారు. అనంతరం ఆమెను ఉయ్యాలవాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సమచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి రామలక్ష్మి వద్ద వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు కసాయి భర్త భాగోతం బయటపెట్టటంతో పోలీసులు భాస్కర్ పై హత్యాయత్నం తోపాటు 498ఏ,201 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు

Related Posts