Home » బోధన్ కేంద్రంగా నకిలీ పాస్‌పోర్టులు..ఇద్దరు పోలీసు అధికారుల పాత్ర..75 పాస్‌పోర్ట్ అడ్రస్‌లపై ఆరా
Published
3 days agoon
bodhan fake address passports case : నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా వెలుగుచూసిన నకిలీ అడ్రస్ పాస్‌పోర్ట్‌ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 75 పాస్‌పోర్ట్‌లు నకిలీ అడ్రస్‌తో జారీ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ కేసులో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. కాసుల కోసం కక్కుర్తి పడే… రోహింగ్యాలకు పాస్‌పోర్ట్‌ల జారీ అయ్యేలా సహకరించేందుకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐ మల్లేశ్వరరావు, ఏఎస్ఐ అనిల్‌ను అరెస్ట్ చేశామని నిజామాబాద్ సీపీ చెప్పారు. బోధన్‌లో నకిలీ పాస్‌పోర్ట్ వ్యవహారంలో దొరికిన కేటుగాళ్లు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌ల కేసులో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. దర్యాప్తు ముమ్మరం చేశామని.. దోషుల్ని ఎవర్నీ వదిలేది హెచ్చరించారాయన.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నకిలీ పాస్‌పోర్ట్ వ్యవహారం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న అనుమానంతో తీగ లాగితే ఏకంగా డొంకే కదులుతోంది. ఒకట్రెండు కాదు ఏకంగా 75 పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు కేటుగాళ్లు. తప్పుడు ఆధారాలతో రోహింగ్యాలకు పాస్‌పోర్ట్‌లు జారీచేస్తూ దేశం దాటించిన వ్యవహారంలో పోలీసుల పాత్ర ఉండడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
బోధన్‌లో ఎస్సైగా పనిచేసిన మల్లేశ్వర్రావు, పాస్‌పోర్ట్ ఏజెంట్ పరిమలన్తో కలిసి ఈ వ్యవహారం నడిపించాడు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కు.. బెంగాల్ నుంచి బోధన్‌కు వచ్చిన వాళ్లకు తప్పుడు ఆధారాలతో పాస్‌పోర్ట్‌లు ఇప్పించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇందులో 32 పాస్‌పోర్ట్‌లకు ఎస్సై మల్లేశ్వర్రావు ఇంటి చిరునామాతోనే ఇప్పించారు కేటుగాళ్లు.
నకిలీ పాస్‌పోర్ట్‌లతో దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు బోధన్‌లో ఒకే అడ్రస్ ఉండడంతో.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అనుమానంతో ఆరా తీస్తే… ఎస్సై, ఏజెంట్ చేసిన నకిలీ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో కొందరు రోహింగ్యాలనూ అరెస్ట్ చేశారు. మిగిలినవాళ్లు బోధన్ పరిసరాల్లో ఉన్నారా? లేకపోతే దేశం దాటి వెళ్లిపోయారా?…ఇప్పుడిదే కలకలం సృష్టిస్తోంది. తప్పుడు అడ్రస్‌తో పాస్‌పోర్ట్ పొందినవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రంగస్థల నాటకంలో షాకింగ్ ఘటన.. పాత్రలో లీనమైపోయి త్రిశూలంతో హత్యాయత్నం
టూల్‌కిట్ కేసులో ఐఎస్ఐ పాత్ర!
ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం…గుప్త నిధుల కోసం బాలికను బలి ఇచ్చారా?
మంత్రి పేర్నినానిపై కావాలనే హత్యాయత్నం…పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు
ఈయన ఎవరో చెప్పండి : సినిమాలో నటిస్తున్న YCP MLA
అతడు-ఆమె-అఫైర్ : కార్తీక్ హత్య, రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!!