చివరి నిమిషంలో ఎంటరై ప్రేమను కాపాడిన పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Marriage: ప్రియురాలికి పెళ్లి జరుగుతున్న ప్లేస్‌కు టైంకు రాలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన యువకుడు ప్రేమను గెలిపించుకున్నాడు. కడపకు చెందిన యువతి, చెన్నైకు చెందిన వ్యక్తి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పేరెంట్స్ కు ఈ విషయం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయిన యువతి.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలూపేసింది.

ఫలితంగా గుర్రంకొండకు చెందిన వ్యక్తితో వివాహం ఫిక్స్ చేసి ముహూర్తం పెట్టేశారు. ఇరువైపుల నుంచి బంధుమిత్రులు కళ్యాణ మండపానికి రావడంతో కోలాహలంగా గురువారం రాత్రి ఫంక్షన్ జరిగింది. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందని అనుకుంటుండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు ఎంటరై సీన్ మార్చేశారు.తమిళనాడులో ఉంటున్న ఆమె ప్రియుడు అక్కడి పోలీసులకు చెప్పి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమాచారం అందడంతో లోకల్ హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు ఇద్దరు మహిళా పోలీసులు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషయం అర్థమయ్యేలా చెప్పారు.

పెళ్లికూతురికి విషయం తెలియజేయడంతో ఈ పెళ్లి ఇష్టం లేదని కన్ఫామ్ చేసింది. ఉదయం 8 గంటల వరకు కౌన్సిలింగ్ చేసినా నవ వధువు లవర్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. అనుకున్నట్లు పెళ్లి జరగకపోవడంతో పెళ్లికొడుకు టీం వెళ్లిపోయారు. పోలీసులు నవ వధువును, వారి తల్లిదండ్రులను స్థానిక తహశీల్దార్‌ అమరనాథ్‌ ముందు హాజరుపరిచారు.

తహసీల్దార్‌ వాంగ్మూలం తీసుకొని యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. సినిమాటిక్‌గా మధ్యాహ్నం సమయంలో బాయ్ ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడు. స్నేహితులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చివరకు పోలీసులు ప్రియుడిని, నవవధువు పేరెంట్స్‌ను కడపకు పంపారు.

Related Tags :

Related Posts :