లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

రాహుల్‌పై దాడిచేసిన నిందితుల కోసం గాలింపు – బెంగుళూరుకు స్పెషల్ టీమ్స్..

రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసుల గాలింపు..

Published

on

police searching for culprits over Rahul Sipling Attack

రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసుల గాలింపు..

సింగర్, తెలుగు బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో రాహుల్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సీసీటీవీ ఫుటేజ్ వీడియోను షేర్ చేస్తూ, తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేశాడు రాహుల్.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. రాహుల్‌ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వద్దకు తీసుకెళ్లి, తనకు మద్దతు తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన గచ్చిబౌలి పోలీసులు ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రధాన నిందితుడైన తాండూర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డితో పాటు అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. ఇటీవలే వారంతా బెంగుళూరుకు పారిపోయినట్లు తెలియడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి పలు ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు సమాచారం. అలాగే నిందుతులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

‘రాహుల్ మీద దాడి చేసివ వాళ్లు పెద్దవాళ్లైనా ఎవరైనా శిక్ష పడాల్సిందే.. పబ్ లకెళ్లడం తప్పని చెప్పడంలేదు.. కానీ బాటిల్స్‌తో అలా కొట్టడం.. చంపేస్తారా ఏంటి.. అలాకాదు.. ఆ అహంకారం తప్పు.. నేను రేపు కమీషనర్‌తో కూడా మాట్లాడతాను.. రాహుల్ కోసం మేం నిలబడతాం.. తనకి కాస్త ధైర్యమిస్తున్నానంతే’.. అంటూ ప్రకాష్ రాజ్ మీడియాకు తెలిపారు.

See Also |  ఉగాదికి మెగాస్టార్-యంగ్ రెబల్ స్టార్..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *