police seized Improperly moving PDS rice

110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు : ఇద్దరు అరెస్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రామగుండం పోలీసు కమీషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరోంచకు అక్రమంగా డీసీఎంలో తరలిస్తున్న సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంథని వెళ్ళే మార్గంలో గుంజపడుగు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. p

పోలీసుల కథనం ప్రకారం రామగుండం టాస్క్ ఫోర్సు సీఐ, సిబ్బందితో కలిసి మంథనికి వెళ్తుండగా.. కొంతమంది పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం వారికి అందింది. దీంతో డీసీఎంను ఫాలో చేసిన పోలీసులు TS O2 UA 1517 నెంబర్ గల డీసీఎంను అడ్డగించారు. అందులో సుమారు 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డీసీఎంను సీజ్ చేసిన పోలీసులు అక్రమానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఓదెల మహేందర్, బోగే సాగర్ మంథనికి చెందిన వారు. కాగా ఓదెల మహేందర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, పీడీఎస్ బియ్యం ఎక్కడ నుండి ఎక్కడికి తరలిస్తున్నారని ఆరా తీశారు. దీంతో డీసీఎం యజమాని రమేష్ తమను పంపించారని తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను మంథని పోలీసులకు అప్పగించారు. 
 

Related Posts