లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతుల ఆందోళనపై 16 ఎఫ్ఐఆర్ లు నమోదు…పంజాబీ నటుడు దీప్ సిద్ధుకు బిగుస్తున్న ఉచ్చు

Published

on

Police investigation over farmers’ agitation in Delhi : ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతుల ఆందోళనపై ఇప్పటి వరకు 15 ఎఫ్‌ఐఆర్‌ కేసులు నమోదు చేశారు. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా పంజాబీ నటుడు దీప్ సిద్దుపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు రోజు రైతుల స్టేజీపై దీప్ సిద్దు ప్రసంగించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు కూడా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు నిర్ణయించిన రూట్‌లో ర్యాలీ వద్దని… రింగు రోడ్డుపై ర్యాలీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నిర్ణయం తీసుకోవాలని… లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇదే డిమాండ్‌కు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా మద్దతు తెలిపింది. పరేడ్ రోడ్ – రింగ్ రోడ్ పేరుతో నినాదాలు చేశారు.

దీప్ సిద్దు వ్యాఖ్యలతో ప్రభావితమైన యువత… ర్యాలీలో ఆందోళన చేపట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీప్ సిద్దుకు నిషేధిత సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’తో సంబంధాలపై అనుమానాలున్నాయి. ఈ వ్యవహారంలో దీప్ సిద్దుతో పాటు అతని సోదరుడు మన్‌దీప్ సింగ్‌కు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. ఎర్రకోట హింస జరిగిన ప్రాంతంలో కూడా దీప్ సిద్దు కనిపించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు, బీజేపీ అభ్యర్థి సన్నీ దేవల్ తరఫున ప్రచారం దీప్ సిద్దు
చేశారు. కేంద్రం ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసింది.

మరోవైపు ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే సుమారు 15 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన పోలీసులు… ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన ఆందోళనకారుల కోసం గాలింపు చేపట్టారు. శాంతియుత ర్యాలీ పేరుతో అనుమతి తీసుకుని… ట్రాక్టర్లతో విధ్వంసం సృష్టించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జామియా మియా ప్రాంతంలో మెట్రో సేవలను అధికారులు నిలిపివేశారు.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. చట్టాలను రద్దు చేయాలని పదే పదే కోరుతున్న కేంద్రం పెడచెవిన పెట్టింది. 60 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులు…. రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థతికి దారితీసింది. తమ డిమాండ్ నెరవేర్చాలని రైతులు కదం తొక్కారు.

ఢిల్లీలో జరిగిన ఘర్షణలో 80 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. 300 బ్యారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. నాలుగు కంటైయినర్లు.. 17 ప్రజా రవాణా వాహనాలను ధ్వంసం చేశారు. ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ, హింసతో దేశం ఉలిక్కిపడింది. రైతులు ఇలా చేస్తారా అంతా ఆశ్చర్యపోతున్నారు. చెప్పిన రూట్ మ్యాప్ కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చి.. బీభత్సం సృష్టించారు.

ఎర్రకోటపై తమ జెండా ఎగరవేసి.. నిరసన తెలియజేశారు. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రైతుల చేసిన ఆందోళనలపై పోలీసులు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేశారు. రైతు నేతలు చేసిన ఆందోళనతో దేశం ఒక్కసారికి ఉలిక్కిపడింది. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని కూడా కోరుతోంది.