తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్: కూతుర్ని పణంగా పెట్టి రేపిస్టులను పట్టుకున్న పోలీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Policeman: రేపిస్టులను పట్టుకునే క్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్ కూతూర్నే పణంగా పెట్టాడు. అంతేకాకుండా రేపిస్టుల కామదాహానికి బలైపోయిన తల్లీకూతుళ్లను కాపాడాడు. కాష్మోరాలోని సింధ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సినిమాటిక్‌గా అనిపించినా ఆ ఆఫీసర్ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.

ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఐదేళ్ల కూతురితో పాటు తల్లి కూడా వచ్చింది. కరాచీ నుంచి కష్మోరా ప్రాంతానికి వచ్చిన వారు మోసపోయి ఓ గ్యాంగ్ వలలో ఇరుక్కుపోయారు. పలు లొకేషన్లు మారుతూ.. రోజుల పాటు వారిని హింసించారు. ఈ క్రమంలో విడిచి పెట్టాలని ఆ తల్లి ప్రాధేయపడటంతో మరొకరిని తీసుకొస్తే తన కూతుర్ని తనని వదలిపెడతామని చెప్పారు.ఆ ఒప్పందంతో మహిళను విడుదల చేయగా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ ఏఎస్ఐ మొహమ్మద్ బక్స్ బురిరోను కలిసింది. అతనిపై నమ్మకంతోనో.. మరెవరూ ధైర్యం చేయరనుకున్నాడో సొంత కూతుర్నే ఆమెకు అప్పగించి స్పాట్ అయిన పార్క్‌కు పంపాడు.

ప్లాన్ ప్రకారం.. ఆ మహిళ కూతుర్ని విడిచిపెట్టిన నిందితుడు వెంటనే కొత్తగా తెచ్చిన బాలికను పట్టుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చాటుగా ఉన్న పోలీస్ సీన్ లోకి ఎంటర్ అయి రఫిక్ మలక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో బగ్తీ అనే నిందితుడు కూడా ఉన్నట్లు తెలిసింది. అతణ్ని పట్టుకునే క్రమంలో పోలీసులు రైడ్ చేయగా కాల్పులు జరిగి మలక్ అనే నిందితుడు మృతి చెందాడు. తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు బగ్తీని అదుపులోకి తీసుకున్నారు.
సింధ్ ప్రభుత్వం బురిరో అతని కూతురు సాహసోపేతమైన చర్యలకు ప్రశంసలు తెలిపింది. అతనికి ఫెడరల్ గవర్నమెంట్ నుంచి క్వైద్ ఏ అజామ్ పోలీస్ మెడల్ ఇచ్చేందుకు సిఫారసు చేస్తామంటూ హామీ ఇచ్చింది. బురిరో కూతురు ధైర్య, సాహసాలకు పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. గ్యాంగ్ ను ట్రేస్ చేయడం అంత సులువైన పనికాదని బురిరో చాకచక్యంగా వ్యవహరించారని కొనియాడారు.

12 ఏళ్ల కూతుర్ని పెన్సిల్ తో పొడిచి..కొరికి హింసించిన తల్లి..మా అక్కను కాపాడమంటూ ఫోన్ చేసిన చెల్లి


రేపిస్టుల చేతిలో గాయపడ్డ తల్లీకూతురికి సివిల్ హాస్పిటల్ లర్కానాలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఆ ఐదేళ్ల బాధితురాలికి ట్రీట్‌మెంట్ అవసరమైతే ప్రపంచంలో ఎక్కడికైనా పంపేందుకు సిద్ధంగా ఉన్నామని సింధ్ ప్రభుత్వం చెబుతుంది. మున్ముందు ఆ బాలిక చదువుకోవడానికి అవసరమైన విద్యాపరమైన ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది.

Related Tags :

Related Posts :