లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

తమిళనాడులో పొలిటికల్ జల్లికట్టు, నేతల పోటాపోటీ పర్యటనలు

Published

on

Political jallikattu : తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జల్లికట్టు ఉత్సవాలు జోరందుకున్నాయి. అయితే ఈసారి పొలిటికల్‌ జల్లికట్టు మరింత జోరుగా జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. పండుగ రోజు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు తమిళనాడులో పోటాపోటి పర్యటనలు చేస్తున్నారు. మధురైలో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హాజరయ్యారు.. డీఎంకే ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ కొడుకు, యాక్టర్‌ ఉదయనిధితో కలిసి ఆయన జల్లికట్టు పోటీలను వీక్షించారు.

దేశ భవిష్యత్తుకు తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్ర ఎంతో అవసరమని, అందుకే తమిళనాడుకు వచ్చానని.. తమిళ భాషపైన, తమిళులపైన ఆధిపత్యం చెలాయించగలమని భావించేవారు ఆ విధానాన్ని వీడాలన్నారు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా రైతుల సమస్యలను కూడా ప్రస్తావించారు రాహుల్‌.

మరోవైపు తమిళనాడులో నిర్వహించిన నమ్మ ఒరు పొంగల్‌ కార్యక్రమంలో బీజేపీ చీఫ్‌ జయప్రకాశ్‌ నడ్డా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై పలు విమర్శలు చేశారు నడ్డా.. జల్లికట్టు వేడుకలపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ విమర్శించారు.. జల్లికట్టును నిషేధిస్తామని కాంగ్రెస్‌ గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్నీ గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతోనే రాహుల్‌ గాంధీ జల్లికట్టుకు హాజరయ్యారంటూ విమర్శించారు.. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు పోటీలకు మించి.. ప్రస్తుతం పొలిటికల్ దంగల్‌ మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది..