లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఎన్నికల్లో రిగ్గింగ్…గిల్గిత్​-బాల్టిస్థాన్​లో నిరసనలు హింసాత్మకం

Published

on

Political violence in Gilgit-Baltistan పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్​-బాల్టిస్థాన్​లో నిరసనలు చెలరేగాయి. గిల్గిత్​-బాల్టిస్థాన్​ వీధులు నిరసనలతో హోరెత్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి..రెండు స్థానిక నియోజకవర్గాల్లో రిగ్గింగ్​ జరిగిందంటూ పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ ఆందోళన చేపట్టింది.



ఈ సమయంలో నాలుగు వాహనాలతో పాటు అటవీశాఖకు చెందిన ఓ భవనానికి నిప్పంటించారు ఆందోళనకారులు.తొలుత.. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చెలరేగిందని.. ఆ పరిణామాలు హింసాత్మక ఘటనకు దారితీశాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని పేర్కొన్నారు.



అయితే హింసాత్మక ఘటనల్లో తమ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని పీపీపీ ఆరోపించింది. తమ కార్యకర్తలపై పోలీసులు బాష్పవాయును ప్రయోగించారని ఆరోపించింది పీపీపీ. ఈ నేపథ్యంలో అనేక మంది కార్యకర్తలు గాయపడ్డారని తెలిపింది.



కాగా, గత వారంలోనూ పాకిస్థాన్​ ఆక్రమిత ప్రాంతంలో ఇదే తరహా నిరసనలు చెలరేగాయి. గిల్గిత్​-బాల్టిస్థాన్​ ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందని ఆరోపించిన ఆందోళనకారులు.. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *