AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ. ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, లాలూ యాదవ్ వంటి వారు స్థాపించి బాగానే రాణించినప్పటికీ, వారి రాష్ట్రాలను దాటి పార్టీని విస్తరించలేకపోయారు. దీంతో ఆ పార్టీలకు జాతీయ స్థాయి గుర్తింపు రాలేదు.

AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

AAP now National Party, gujarat polls supported

AAP National Party: అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించినప్పుడు, చాలా మంది రాత్రికి రాత్రే ఎగిరి గంతేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మాజీ టక్స్ అధికారి అయిన ఆయనకు రాజకీయ అనుభవం లేదని, రాజకీయాల్లో రాణించలేరని పెదవి విరిచారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన లోక్‭పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ప్రముఖంగా ఉన్నారు.

ఈ 10 ఏళ్లలో రాజకీయాల్లో రెండు ప్రధాన మార్పులు జరిగాయి. ఒక బీజేపీ ఉప్పెన, రెండు కాంగ్రెస్ పతనం. ఈ రెండింటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. చూస్తుండగానే ఢిల్లీలో అధికారంలోకి రావడం, అనంతరం పంజాబ్‭లోనూ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇక గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు సాధించి ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగింది.

Results: ఎగ్టాక్ట్ పోల్స్‭కు దూరంగా ఎగ్జిట్ పోల్స్.. అంచనాలను ఏమాత్రం అందుకోలేని సర్వేలు

జాతీయ పార్టీకి కనీసం మూడు రాష్ట్రాల్లో రెండు శాతం లోక్‌సభ స్థానాలు ఉండాలి. అంటే 11 సీట్లు. ఆప్‌కి లోక్‌సభ ఎంపీలు సున్నా. పార్లమెంటులో కనిపించే రాఘవ్ చద్దా, సంజయ్ వంటి నేతలు ఉన్నప్పటికీ వారు రాజ్యసభ సభ్యులు. మరో అంశం, ఆశించే వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉండాలి. రాష్ట్ర పార్టీ గుర్తింపు కోసం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆరు శాతం ఓట్లతో పాటు రెండు సీట్లు లేదంటే ఆరు శాతం కంటే తక్కువ ఓట్లు ఉనప్పటికీ మూడు సీట్లు అవసరం.

మొదటి విషయంలో ఆప్ వెనకబడి ఉన్నప్పటికీ.. రెండవ విషయంలో అనుకున్న ఫలితం సాధించింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అత్యధిక మెజారిటీతో అధికారంలో ఉంది. కొంత కాలం క్రితం జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్ బ్యాంక్, రెండు సీట్ల అవసరాన్ని తీరుస్తుంది. ఇక తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 12 శాతానికి పైగానే ఓట్ బ్యాంక్ సాధించేలా ఉంది. అంతే కాకుండా, ఐదు స్థానాల్లో అభ్యర్థులు లీడింగులో ఉన్నారు.

Gujarat Polls: ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దే ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ నేత

దీంతో నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ. ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, లాలూ యాదవ్ వంటి వారు స్థాపించి బాగానే రాణించినప్పటికీ, వారి రాష్ట్రాలను దాటి పార్టీని విస్తరించలేకపోయారు. దీంతో ఆ పార్టీలకు జాతీయ స్థాయి గుర్తింపు రాలేదు.

ఇక జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఎన్‌సీపీ, టీఎంసీ, సీపీఐ, బీఎస్‌పీ వంటి పార్టీలు జాతీయ రాజకీయాల్లో ఆశించినంతగా రాణించలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పతానవస్తలో ఉంది ఇలాంటి దశలో ఆప్‭కు జాతీయ పార్టీగా గుర్తింపు రావడం వచ్చే ఎన్నికల్లో పార్టీ ఉన్నతికి మరింత ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే ఏదైనా అద్భుతం జరిగితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చనే అంచనాలు కూడా వస్తున్నాయి.