AAP vs Congress: బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల పోటీ.. ఆప్ తీరుపై కాంగ్రెస్ గరంగరం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజేపీకి 52.5 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ 27.3 శాతం ఓట్లే సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మూడో ప్రత్యర్థిగా పోటీకి దిగిన ఆప్ అనూహ్యమైన ఓట్ బ్యాంక్ సాధించింది

AAP vs Congress: బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల పోటీ.. ఆప్ తీరుపై కాంగ్రెస్ గరంగరం

AAP played spoiler in Gujarat says Congress

AAP vs Congress: కాంగ్రెస్ పార్టీ ఓడి బీజేపీ గెలిచిన ప్రతిసారి మిగతా విపక్ష పార్టీలపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ప్రధానంగా బీఎస్‭పీ, ఎంఐఎం పార్టీల వల్లే బీజేపీ గెలుస్తోందని, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే కాకుండా ఇతర విపక్ష నేతలు కూడా ఆరోపిస్తుంటారు. గుజరాత్ ఎన్నికల వల్ల ఈసారి ఆ రెండు పార్టీల ఫోకస్ పోయి ఆమ్ ఆద్మీ పార్టీపైకి వచ్చింది. ఆప్ వల్లే కాంగ్రెస్ నష్టపోయి, బీజేపీ ఘన విజయాన్ని సాధించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆప్‭ తీరు పట్ల హస్తం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Rajasthan: యూటర్న్ తీసుకున్న అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్‭తో ఇక వైరం లేనట్టేనా?

అసలు ఏం జరిగిందంటే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజేపీకి 52.5 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ 27.3 శాతం ఓట్లే సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మూడో ప్రత్యర్థిగా పోటీకి దిగిన ఆప్ అనూహ్యమైన ఓట్ బ్యాంక్ సాధించింది. ఏకంగా 13 శాతం ఓట్ బ్యాంక్ సాధించి ఔరా అనిపించింది. ఆప్ సాధించిన ఈ ఓట్ బ్యాంక్ బీజేపీయేతర ఓట్లేనని వేరే చెప్పనక్కర్లేదు. ఒక వేళ ఆప్ పోటీలో లేకపోయుంటే ఈ ఓట్లు తమకే పడేవని, అప్పుడు బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ వచ్చేది కాదని కాంగ్రెస్ నేతల వాదన.

PM Modi: అలాంటి రాజకీయాలు చేసే నాయకులను హెచ్చరిస్తున్నా.. ప్రధాని మోదీ

వచ్చే సాధారణ ఎన్నికల్లోపు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తుంటే ఆప్ మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి బీజేపీకి లాభం చేకూర్చే పనిలో బిజీగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. దీనికి ముందు జైరాం రమేశ్ మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఆప్-ఎంఐఎం పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని అన్నారు.