రేవంత్‌పై యాక్షన్ తీసుకోవాల్సిందే – ఎం.ఎస్.ప్రభాకర్

  • Published By: madhu ,Published On : March 12, 2020 / 02:45 PM IST
రేవంత్‌పై యాక్షన్ తీసుకోవాల్సిందే – ఎం.ఎస్.ప్రభాకర్

రేవంత్ భూ దందా వ్యవహారం..పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలిని కూడా తాకింది. 2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగిన సమావేశాల్లో గోపన్ పల్లిలో రేవంత్ భూ దందాపై మండలిలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసు, భూ ఆక్రమణ కేసు పెట్టాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన భూమిని దళితులకు తిరిగి ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. ఈ అంశంపై ఆయనతో 10tv ముచ్చటించింది. 

అహంకారంతో..గోపన్ పల్లిలో కొన్ని వేలాది ఎకరాల భూమి కబ్జా చేశారని, ఇది చాలా సీరియస్ అంశమని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. దళితులకు అండగా ఉండాల్సిన ఓ ఎంపీ..కుటుంబసభ్యులతో కలిసి దారుణానికి పాల్పడడం మంచిది కాదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములను కబ్జా చేస్తున్నారని, ప్రధానంగా గోపన్‌పల్లి భూముల విషయంలో శాసనమండలిలో చర్చ జరిగిందన్నారు. నాలా భూములు, ప్రభుత్వ భూములు, దళిత భూములను కబ్జా చేశారన్నారు.

చట్టం ఎవరి చేతుల్లోకి తీసుకొనే ఛాన్స్ లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే..ఎవరైనా సరే..కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. వందలు, రెండు వందల గజాలు కాదని, రూ. 150 కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసే అంశంపై దృష్టి సారించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చలాంటిదని, ఇతనిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని..అయినా..వారి పార్టీ ఇష్టమన్నారు. తప్పకుండా..దీనిపై తాము పోరాటం చేస్తామని, దళిత నేతగా..కేసు వేస్తానన్నారు. దీనిపై సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. భూ దందాకు పాల్పడిన వారెవరైనా..వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతామని సభలో వెల్లడించారు. 

Read More : నాకు సీఎం కావాలని ఉంది..ఏం రేవంత్‌కు ఒక్కడికే ఉంటదా – జగ్గారెడ్డి