AIADMK-BJP: బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఇక ఉండదు?.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు

చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానని, సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని అన్నామలై అన్నారు.

AIADMK-BJP: బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఇక ఉండదు?.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు

AIADMK-BJP

AIADMK-BJP: తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి బీటలు పడుతున్నాయి. త్వరలోనే ఈ రెండు పార్టీలు విడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, బీజేపీ నుంచి నేతలను కొనుగోలు చేసే పనిలో అన్నాడీఎంకే నిమగ్నమైందని కాషాయ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగుతుండగా, ఇప్పుడు మరో వివాదం తలెత్తింది.

తమిళ న్యూస్ డైలీ దిన తంతి తాజాగా తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం చెన్నైలో బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించగా, అందులో అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానని, సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని అన్నామలై అన్నారు.

తమిళనాడులో బీజేపీ మరింత బలపడాలని, అందుకు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీచేయాలని, ఏ ద్రవిడియన్ పార్టీ వెనుక రెండో స్థానంలో ఉండకూడదని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే అవినీతి, వారసత్వ రాజకీయాలపై బీజేపీకి అనుసరిస్తున్న వైఖరిపై ప్రజలు సీరియస్ గా ఉంటారని అన్నారు. అన్నామలై ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక మీడియాలో రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అటువంటి వ్యాఖ్యలు అన్నామలై చేయలేదని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు.

Ecuador Earthquake: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు, 14 మంది మృతి