Akhilesh Yadav: ప్రాంతీయ పార్టీలనే హీరోగా చూడాలి.. 2024లపై కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వినూత్న ప్రతిపాదన

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్‌ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు

Akhilesh Yadav: ప్రాంతీయ పార్టీలనే హీరోగా చూడాలి.. 2024లపై కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వినూత్న ప్రతిపాదన

Akhilesh Yadav

2024 Elections: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూనైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఉంది. ఈ రెండు కాకుండా దేశంలో విపక్షాలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అంటున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రాంతీయ తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత్ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ స్థాయిలో ఆ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Assam Police : మూడు నెలల్లో ఫిట్‌ అవ్వండీ లేదంటే వీఆర్ఎస్ తీసుకుని ఇంటికెళ్లండీ : పోలీసులకు వార్నింగ్

ఇక మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు కూడా కూటమి ఏర్పాటు ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏదో ఒక కూటమిలో చేరడమో లేదంటే మిగతా పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేయడానికో బదులు అఖిలేష్ చాలా వినూత్న ప్రతిపాదన చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎక్కడైతే స్థానిక పార్టీలు బలంగా ఉంటాయో, అక్కడ ఆ పార్టీలకు ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. కరెక్టుగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని పార్టీలనే హీరోలుగా చూడాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన నేరుగానే చెప్పారు.

Bengal: అక్రమ బాణాసంచా కారాగారంలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్‌ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. “అనేక ప్రాంతీయ పార్టీలు – వారి వారి రాష్ట్రాల్లోని దిగ్గజాలు – బీజేపీతో బలంగా పోరాడుతున్నాయి. ఈ ప్రాంతీయ దిగ్గజాలన్నీ ఏకతాటిపైకి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన పాత్రను నిర్ణయించుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతివ్వాలి. ప్రాంతీయ పార్టీలను ముందంజలో ఉంచి, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.

Karnataka CM: ఎన్నికల్లో గెలవడం కంటే సీఎంను ఎంపిక చేయడమే కష్టమైంది.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న గత అనుభవాలు

“యుపిలో సమాజ్ వాదీ పార్టీ అన్ని స్థాయిలలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎస్పీ ఓడిస్తుంది. ప్రజలంతా ఎస్పీకి మద్దతివ్వాలి. తద్వారా యూపీ నుంచి దేశం నుంచి బీజేపీని వదిలించుకోవాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నాయి. ఇది బీజేపీని తుడిచిపెట్టడానికి దారి తీస్తుంది. జాతీయ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా తన పాత్రను పోషిస్తుంది’’ అని అఖిలేష్ అన్నారు.