బీజేపీ మోసం చేసింది : జనసేనలోకి ఆకుల

ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 12:38 PM IST
బీజేపీ మోసం చేసింది : జనసేనలోకి ఆకుల

ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

విజయవాడ: ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చలేదన్నారు. బీజేపీకి, రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని ఆకుల సత్యనారాయణ చెప్పారు. బీజేపీపై ఆకుల మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. విశాఖ రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు. అధికార తెలుగుదేశం పార్టీపైనా సత్యనారాయణ విమర్శలు చేశారు. టీడీపీ నేతలవి చేతకాని మాటలన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని ఆకుల చెప్పారు. రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.

ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరడానికి 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఉదయం భారీ ర్యాలీగా విజయవాడకు వచ్చారు. ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆకుల సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణకు మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఆకుల వర్గీయులు, అనుచరులు కూడా భారీ సంఖ్యలో బీజేపీకి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ స్థానం బీజేపీకి దక్కింది. బీజేపీ తరపున ఆకుల సత్యనారాయణ పోటీ చేసి గెలుపొందారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. భార్య పద్మావతి మాత్రం జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ జనసేన చేసిన పోరాటంలో పాల్గొన్నారు. దాంతో ఆకుల సత్యానారాయణ సైతం జనసేన గూటికి చేరతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది.

ఆకుల సత్యనారాయణ పార్టీలో చేరడం శుభపరిణామన్నారు పవన్ కళ్యాణ్. 2014లో పొత్తులో భాగంగా ఆకులకు మద్దతిచ్చామని.. ఆయన చేరికతో జనసేన మరింత బలోపేతం అవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని.. జనసేన పార్టీ ఆయనకు అండగా ఉండి ప్రోత్సాహం ఇస్తుందని జనసేనాని అన్నారు.