తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్, రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 02:44 PM IST
తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్, రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు

holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఉత్తర్వుల వచ్చేవరకు స్టాంప్స్, రిజస్ట్రేషన్ కార్యాలయాలకు హాలిడేస్ ఇచ్చింది. అంటే రేపటి నుంచి అన్ని రిజిస్ట్రేషన్స్ నిలిచిపోనున్నాయి. వీఆర్వీల దగ్గరున్న రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను  ప్రభుత్వం ఆదేశింది. ఆమేరకు వీఆర్వీల నుంచి రికార్డులను తాసిల్దార్లు స్వాదీనం చేసుకున్నారు.



కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జరుగబోయే కేబినెట్‌ భేటీలో కొత్త రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. ఇప్పుడు ఆ దిశగా కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తున్నట్టు తెలిసింది.



అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.. పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినవారినే అసెంబ్లీలోకి అనుమతించారు.



అసెంబ్లీ సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి శాసన సభ్యులందరూ సంతాపం ప్రకటించారు. ఆపై అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.