పవన్.. సినిమాల్లో హీరో, రాజకీయాల్లో విలన్

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 01:59 PM IST
పవన్.. సినిమాల్లో హీరో, రాజకీయాల్లో విలన్

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు పెట్టుకోవాలని, పులివెందులకు దగ్గరగా ఉంటుందని పవన్‌ అనడం దారుణం అన్నారు. రాంబాబు ఇంటికి పెళ్లికి వెళ్లానని పదే పదే పవన్‌ చెప్పడం బాధాకరమన్నారు. అంటే పెళ్లికి వచ్చినంత మాత్రానా రాజకీయంగా విమర్శించకూడదా అని ప్రశ్నించారు. లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

చిరంజీవి అశీస్సులతోనే పవన్‌ హీరో అయ్యారని అంబటి గుర్తుచేశారు. అయితే చిరంజీవి సపోర్ట్‌ లేకపోవడంతో రాజకీయాల్లో హీరో కాలేకపోయారని అన్నారు. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో మాత్రం విలన్ అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు మెయిన్‌ విలన్‌ అయితే.. పవన్‌ సైడ్‌ విలన్‌ అని అభివర్ణించారు. పవన్‌ టీడీపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తునారని ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

ఇండియా మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేకపోవడానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. రాజధాని పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహా చిత్రాలు, గ్రాఫిక్స్‌తో చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. దేశంలో దొరికిన చోటల్లా అమరావతి పేరుతో చంద్రబాబు అప్పులు చేశారని… రాజధాని పేరుతో రూ.9 వేల కోట్లు వృథా చేశారని చెప్పారు. రాజధాని అంతా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారే తప్ప.. సాధించింది ఏమీ లేదన్నారు.

అమరావతిలో ఒక్కటైనా శాశ్వత కట్టడం ఉందా అని నిలదీశారు. రాజధాని పేరుతో రైతులను మోసం చేశారని.. రాజధాని చుట్టూ చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని ఆరోపించారు. వైసీపీపై బురద జల్లడానికి టీడీపీ చెడ్డీ గ్యాండ్ బయలుదేరిందని అంబటి అన్నారు. ఇసుకు దోచుకున్న చంద్రబాబే ఇసుక దీక్ష చేస్తామనడం కామెడీగా ఉందన్నారు.