రాజధానిలో హత్యలకు కుట్ర జరుగుతోంది : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 12:53 PM IST
రాజధానిలో హత్యలకు కుట్ర జరుగుతోంది : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు, వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 21 నిమిషాలు ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వీడియోని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ లపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

చంద్రబాబు కుట్ర స్వభావం కలిగిన వ్యక్తి అని, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని అంబటి రాంబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని నమ్మొద్దని రాజధాని రైతులకు విజ్ఞప్తి చేశారు. హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి కుటుంబసమేతంగా అమరావతిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో రైతులు ఆందోళన చేశారు.. అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. మెర్సీ కల్లింగ్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, పవన్ లది కపట ప్రేమ అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు.

* రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్
* అమరావతిలో ల్యాండ్ స్కామ్ పై 21 నిమిషాల వీడియో విడుదల
* జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు ఇన్ సైడర్ ట్రేడింగ్
* బినామీ పేర్లతో కొన్న భూములు పోతాయన్న భయం పట్టుకుంది
* గుంటూరు జిల్లాలో 2279 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు
* అమరావతి రాజధాని ప్రకటనకుముందే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు
* మొత్తం 4069.95 ఎకరాల భూమి కొనుగోలు
* ఇన్నర్ రింగ్ రోడ్ కూడా భూములకు అనుకూలంగా కట్టాలనుకున్నారు

* 800మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు
* 800మంది తెల్లరేషన్ కార్డుదారుల్లో 60మంది తెలంగాణకు చెందిన వారు
* రాజధాని ప్రకటన తర్వాత కూడా భారీగా భూములు కొనుగోలు
* సీఆర్డీఏ పరిధిని విస్తరించి భూముల విలువ పెంచారు
* రైతులపై చంద్రబాబు, పవన్ ది కపట ప్రేమ
* అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
* ఉద్యమాల పేరుతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు
* రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారు

* ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి.. కానీ భూముల కోసం రాజధాని ఏర్పాటు చేసిన ఘతన చంద్రబాబుదే
* రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు
* హైదరాబాద్ పై పదేళ్లు హక్కున్నా వదిలేసి వచ్చేశారు
* రాజధాని రైతులకు వైసీపీ అండగా ఉంటుంది
* రైతులకు న్యాయం చేస్తాం.. బినామీలకు, వ్యాపారులకు కాదు