Maharashtra: తన వెనకాల అమిత్ షా ఉన్నారట.. సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఎవరి అంచనాలకు కూడా అందకుండా ముఖ్యమంత్రిగా ఏక్‭‭నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు.

Maharashtra: తన వెనకాల అమిత్ షా ఉన్నారట.. సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah stood behind me like rock said CM Shinde after winning Sena symbol

Maharashtra: తనకు ఇచ్చిన మాటను అమిత్ షా నలిబెట్టుకున్నారని, నిజానికి షా తన వెనకాల ఒక పర్వతంలా నిల్చున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలైన శివసేన షిండే వర్గానిదే అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన అనంతరం షిండే ఇలా వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే శివసేన ఎమ్మెల్యేలను షిండే చీల్చారని, ఇదంతా ఉద్ధవ్ థాకరే మీద రివేంజ్ ప్లాన్‭లో భాగమేననే విమర్శకుల వ్యాఖ్యలకు తాజాగా షిండే ప్రకటన మరింత ఆయువు పోస్తోంది.

Meghalaya: ఆ ఈవీఎం‭లో ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం బీజేపీకే, వీడియో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకో తెలుసా?

శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ ‘‘మీరు ముందుకు వెళ్లండి, మీ వెనకాల మేము నిలబడతామని అమిత్ షా నాతో చెప్పారు. నిజానికి ఆయన చెప్పిందే చేశారు. తన మాట నిలబెట్టుకున్నారు. నా వెనకాల ఒక పర్వతంలా నిలుచున్నారు’’ అని అన్నారు. గతంలో ఎప్పుడూ బీజేపీ నేతల గురించి షిండే ఈ స్థాయిలో మాట్లాడలేదు. ఎన్నికల పొత్తు ధర్మాన్ని, ప్రజా తీర్పును ఉద్ధవ్ గౌరవించలేదని, అందుకే తాను బయటికి వచ్చాననే ఇన్ని రోజుల పాటు షిండే చెప్పుకొచ్చారు. కానీ, శివసేన తన హస్తంలో పడ్డాక అమిత్ షా తన వెనకాల ఉన్నారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం ఏక్‌నాథ్ షిండే వేసిన దావాకు అనుకూలంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువడడం గమనార్హం. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాల్లో తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన షిండేకు 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ సాధించిన ఓట్లలో ఇది 76 శాతమని కమిషన్ పేర్కొంది. ఉద్ధవ్‌ వైపు 23.5శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది.

Asaduddin Owaisi: అయితే నన్ను చంపుతారా?.. కర్ణాటక సీఎం బొమ్మైకి అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న