ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

  • Published By: chvmurthy ,Published On : January 13, 2020 / 10:04 AM IST
ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

AP Assembly

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం సమాచారం పంపింది.

సీఆర్డీఏ చట్ట సవరణ సహా మరో 3 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. రాజధాని అంశంపై సభలో చర్చించే అవకాశముంది.  ఈ సమావేశంలో 3 రాజధానుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అభివృధ్ది, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా  విశాఖ, కర్నూలు, అమరావతిల్లో ప్రతిపాదిత రాజధానుల అంశం, జీఎన్ రావు కమిటీ. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రుప్, హైపవర్ కమిటీ ఇచ్చేనివేదికలపై చర్చించనున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించనుంది.