స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయి : సీఎం జగన్ వార్నింగ్ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 10:28 AM IST
స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయి : సీఎం జగన్ వార్నింగ్ 

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు. బుధవారం (మార్చి 4, 2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ 40 నిమిషాలకు పైగా జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఉందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సివుంటుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం పంపిణి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పారు. 

ఉగాది రోజున 43, 141 ఎకరాల భూమి పేదలకు పట్టాలు 
ఉగాది రోజున 43, 141 ఎకరాల భూమి పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో తనఖా పెట్టుకునే హక్కుతోపాటు ఐదేళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలనీలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేశారు. 2010లో కేంద్రం ఇచ్చిన ప్రశ్నావళితో జనాభా జనాభా లెక్కలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్పీఆర్ ప్రక్రియ ఆపాలని కేబినెట్ నిర్ణయించింది.

జీఎమ్మార్ కు 2500 ఎకరాలకు కుదిస్తూ నిర్ణయిం 
ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ విత్తనాల సరఫరా కోసం రూ.500 కోట్లు రుణం తెచ్చేందుకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడానికి నిర్ణయించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏర్పాటు చేసిన సిట్ కు ఎఫ్ ఐఆర్, చార్జీషీట్ వేసే ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల్లో జీఎమ్మార్ కు ఇచ్చిన 2700 ఎకరాల భూమిని 2500 కు కుదిస్తూ నిర్ణయిం తీసుకున్నారు.