కొత్త బార్ పాలసీ, మైనింగ్ లీజులు రద్దు : నేడు ఏపీ కేబినెట్ భేటీ

సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 02:09 AM IST
కొత్త బార్ పాలసీ, మైనింగ్ లీజులు రద్దు : నేడు ఏపీ కేబినెట్ భేటీ

సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ

సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. ఎక్సైజ్‌ నూతన పాలసీకి ఆమోదం తెలపడంతోపాటు మైనింగ్‌ లీజుల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఉదయం 11గంటలకు సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది.

కొత్త బార్‌ పాలసీకి మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పలు మైనింగ్‌ లీజులపై ఆరోపణలు వస్తుండటంతో వాటిని రద్దుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు… రాజధాని అమరావతి నిర్మాణంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం, ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటంతో ఈ అంశంపై కేబినెట్ చర్చించనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై వ్యూహాలు రచించనుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సన్న దానిపై సుదీర్ఘ చర్చ జరపనుంది.

సంక్షేమ పథకాల అమలు, విధివిధానాలపైనా ఏపీ కేబినెట్ చర్చించనుంది. డిసెంబర్ నుంచి మార్చి నెలవరకు ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. నవరత్నాల అమలుపైనా చర్చించనున్నారు. వీటితోపాటు… డిసెంబర్‌ 21న ప్రారంభించే చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం పథకం అమలుపైనా చర్చించనున్నారు. ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున.. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునే అంశంపైనా కేబినెట్‌ చర్చించనుంది.