తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 07:33 AM IST
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదు

అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం  వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు కోరారు. ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. అమరావతిలో టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంపైనా స్పందించారు.
Also Read : ఇంటర్ మంటలు : కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్ ధర్నాలు

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఇప్పటికే చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 16మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు బాధ కలిగించాయన్నారు.  ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం తనను కలిచివేసిందన్నారు. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదని, అవి ప్రతిభకు గుర్తింపు మాత్రమే అని, పరీక్షల కంటే జీవితాలు ముఖ్యం అని  చంద్రబాబు అన్నారు. ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవని చెప్పారు. ఓటమి విజయానికి తొలిమెట్టు అని, మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవాలని సూచించారు.
Also Read : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ ఎందుకు మాట్లాడరు