ఢిల్లీ మే సవాల్ : బాబు దీక్షకు అన్నీ రెడీ

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 03:44 PM IST
ఢిల్లీ మే సవాల్ : బాబు దీక్షకు అన్నీ రెడీ

విజయవాడ : ధర్మపోరాట దీక్ష…ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో జరిగింది. టీడీపీ ఇప్పుడు రూటు మార్చింది. ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వేదిక నుండి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజనపై కేంద్రాన్ని నిలదీయనున్నారు బాబు. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం ఉదయం 8 నుండి రాత్రి 8గంటల వరకు బాబు దీక్ష కొనసాగనుంది. ఏపీ భవన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో బస ఏర్పాట్లు చేశారు. ఇక ఈ దీక్షలో పాల్గొనేందుకు 26 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్‌లు, సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. ఏపీ రాష్ట్రం నుండి ప్రత్యేక ట్రైన్‌లలో సుమారు 3వేల మంది టిడిపి కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లగా 4వేల మంది ఆంధ్ర వాసులు దీక్షలో పాల్గొననున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు వ్యూహాలు వేగంగా రచిస్తున్నారు. పలు పథకాలు ప్రకటించడం…ప్రారంభోత్సవాలు చేస్తూ కేంద్ర సర్కార్..మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న ఉద్యమించాలని భావించిన బాబు..ఢిల్లీ కరెక్టు వేదికగా అని యోచించినట్లు టాక్. బీజేపీయేతర పక్షంలో కీలకంగా ఉన్న బాబు…ఢిల్లీలో దీక్ష చేస్తే హైలెట్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి బాబు చేపడుతున్న దీక్షతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.