ప్రోగ్రెస్ రిపోర్ట్ : జగన్ ఆరు నెలల పాలన

వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా... హామీలు అమలయ్యాయా... రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి... విపక్షాలు చెబుతున్నదేంటి.. ఒకసారి చూద్దాం

  • Published By: chvmurthy ,Published On : December 1, 2019 / 02:14 AM IST
ప్రోగ్రెస్ రిపోర్ట్ : జగన్ ఆరు నెలల పాలన

వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా… హామీలు అమలయ్యాయా… రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి… విపక్షాలు చెబుతున్నదేంటి.. ఒకసారి చూద్దాం

వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా… హామీలు అమలయ్యాయా… రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి… విపక్షాలు చెబుతున్నదేంటి.. ఒకసారి చూద్దాం.

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటానంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఏపీలో జగన్ పాలన ఆరు నెలలు పూర్తి చేసుకుంది. తొలి ఆరు నెలల్లోనే అనేక హామీలను అమల్లోకి తీసుకురాగా.. మరి కొన్నింటికి అమలు చేసే తేదీలను ప్రకటించారు. అదే సమయంలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌లో బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ..కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. కేబినెట్ లో అనుసరించిన సామాజిక కూర్పు అందరినీ ఆశ్చర్యపర్చింది. మొదటి కేబినెట్ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం..ఉద్యోగులు 27 శాతం ఐఆర్ అమలుకు నిర్ణయించారు.

కార్మికులు..ఆశా వర్కర్లు..అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచారు. సీపీఎస్ అమలుపై కమిటీ నియమించారు. అటో డ్రైవర్లకు పది వేలు చొప్పున అందించారు. అలాగే అగ్రి గోల్డ్ బాధితులకు సాయం అందచేసారు. ఇక, తొలి అసెంబ్లీ సమావేశాల్లో 75 శాతం స్థానిక రిజర్వేషన్, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్ల అమలు..సచివాలయ వ్యవస్థ.. కొత్త ఉద్యోగాల క్పలన వంటి వాటికి ఆమోదం తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసారు. ఈ ఆరు నెలల్లో పూర్తిగా సంక్షేమం పైనే జగన్ ఫోకస్ చేసారు. నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు.

వైయస్సార్ రైతు భరోసా.. వేతనాలు పెంపు.. ఉద్యోగ కల్పన..వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలు అమలు చేసారు. ఆరోగ్య శ్రీ సేవల పరిధి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.  దశల వారీగా మద్యపాన నిషేధం అమలు మొదలైంది. కీలకమైన అమ్మఒడి.. నేతన్న హస్తం ప్రారంభ ముహూర్తాలు ఖరారు చేసారు.

అయితే… గడిచిన ఆర్నెల్ల కాలంలోజగన్  అభివృద్ధి మీద అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజధాని నిర్మాణం నిలిపివేయడాన్ని జగన్ వైఫల్యంగా విపక్షాలు చెబుతున్నాయి. ప్రజా వేదిక కూల్చివేత..అన్న క్యాంటీన్ల మూసివేతపై వ్యతిరేకత కనిపించింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పెద్ద దుమారాన్నేరేపింది. ఇక, ఇసుక సమస్య రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసినా..కొత్త పాలసీతో ఇప్పుడిపుడే పరిస్థితి మెరుగవుతోందనే వాదని వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల ప్రజా ధనం ఆదా చేయగలుగుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. 

అయితే… 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది  .. అప్పుల్లో రికార్డు సృష్టించడమే అంటూ టీడీపీ విమర్శిస్తోంది. నెలకు సుమారు మూడున్నర వేల కోట్లు చొప్పున అప్పులు తెచ్చారని ఆపార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 6 నెలల్లో దాదాపు 25 వేల కోట్లు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని  విమర్శించారు.

పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలని… అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అంటూ విమర్శించారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన ఉన్నా… తాను చెప్పినట్లు ఆరు నెలల్లో మంచి సీఎం అని జగన్ నిరూపించుకున్నాడా లేదా అనే విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుందంటున్నారు విశ్లేషకులు.