మరో హామీ నెరవేర్చిన సీఎం జగన్ : యానిమేటర్ల జీతాలు పెంపు

  • Published By: chvmurthy ,Published On : November 11, 2019 / 10:54 AM IST
మరో హామీ నెరవేర్చిన సీఎం జగన్ : యానిమేటర్ల జీతాలు పెంపు

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఒక్కక్కటిగా హామీలను నెరవేరుస్తూ వచ్చిన ఏపీ సీఎం జగన్.. ఇప్పుడు మరో కీలక ేనిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో యానిమేటర్లకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తానని, కనీస వేతనాన్ని పెంచుతానని మాట ఇచ్చినట్లుగానే ఇప్పుడు హామీని నెరవేర్చారు.

ఈ మేరకు జగన్ ప్రభుత్వం సోమవారం(11 నవంబర్ 2019) ఉత్తర్వులను విడుదల చేసింది. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవోని జారీ చేసింది.

ఇప్పుడు పెంచిన వేతనం డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. వేతన పెంపుతో సంబంధిత శాఖల ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనివల్ల  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,297 మంది యానిమేటర్లకు లబ్ది చేకూరుతుంది. ప్రభుత్వం నుంచి రూ.8వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు.