నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 02:40 AM IST
నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.

నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం సరఫరా, అమరాతికి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులపై టీడీపీ ప్రశ్నలు సంధించనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఆత్మకూరులో 4 ఎకరాల భూకేటాయింపు, కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తనున్నారు. 

ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణ బిల్లు, పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణ బిల్లు, ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఉల్లి ధరలు, రైతు భరోసాపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అలాగే నేడు రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన చేపట్టనుంది. ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీ ఫైర్ స్టేషన్ దగ్గర నిరసన తెలపనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్నారు.

సోమవారం(డిసెంబర్ 9, 2019) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో పలు అంశాలపై వాడీవేడీగా చర్చ సాగింది. పీపీఏలు, ఉల్లిపాయ ధరలు, మహిళా భద్రతపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లింది. అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ మద్యం వల్లనే నేరాలు జరుగుతున్నాయని.. అందుకే నియంత్రిస్తున్నామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి పడాలన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అత్యాచారాలు, వేధింపుల లెక్కలను వివరించారు.

ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆడవాళ్లను చంపుతుంటే టీడీపీ నేతలకు మనస్సాక్షి లేదా..అన్నం తింటున్నారా..గడ్డి తింటున్నారా అని వ్యాఖ్యానించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. మహిళల భద్రత చట్టానికి టీడీపీ ఇచ్చింది. చంద్రబాబు పలు సూచనలు చేశారు.