BRS: తెలంగాణ దాటి విస్తరిస్తున్న బీఆర్ఎస్.. ఛత్తీస్‭గఢ్‭లో ‘చెయ్యి’ అందిచనున్న కీలక నేత!

ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఆ పార్టీ, 57 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది

BRS: తెలంగాణ దాటి విస్తరిస్తున్న బీఆర్ఎస్.. ఛత్తీస్‭గఢ్‭లో ‘చెయ్యి’ అందిచనున్న కీలక నేత!

As BRS finds one more friend, now from chattisgarh

BRS: దేశ రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న కేసీఆర్ ఆలోచనలకు ఊతం లభిస్తున్నట్లే కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ సహా ఆయన కుటుంబ సభ్యులు కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. తాజాగా ఛత్తీస్‭గఢ్ నుంచి కూడా భారాసకు మద్దతు లభించినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‭గఢ్(జే) అధినేత అమిత్ అజిత్ జోగి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‭ను హైదరాబాద్‭లో కలుసుకున్నారు. ఆ రాష్ట్రంలో భారాసతో కలిపి ఆయన పొత్తు పెట్టుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Karnataka Polls: కర్ణాటక పోరుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికల ఇంచార్జీగా ధర్మేంద్ర ప్రధాన్

తెలంగాణతో ఒడిశాతో పాటు ఛత్తీస్‭గఢ్ సరిహద్దు రాష్ట్రాలు. పైగా దక్షిణాదిలో లేని రాష్ట్రాలు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కనుక భారాస కాస్తంత ప్రభావం చూపినా దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించినట్లే అంటున్నారు. కాగా, ఈ మీటింగ్ అనంతరం అమిత్ జోగి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది చివర్లో జరిగే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు లభించే ఎలాంటి ప్రతిపాదననైనా స్వాగతిస్తానని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోగి, ఆ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈయన ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు.

BMC Budget: రికార్డ్ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముంబై మున్సిపాలిటీ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువే

ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఆ పార్టీ, 57 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో 7.6% ఓట్లు సాధించింది. అయితే, 2020లో అజిత్ జోగి మరణం అనంతరం ఆ పార్టీ సభ్యుల సంఖ్య 2కి తగ్గింది. ఒకరు బీజేపీలో చేరగా, మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఆ రెండు స్థానాలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.