Bihar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‭పై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ఓవైసీ

నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అది కూడా జరగలేదు. తాజాగా మళ్లీ అవే ఆరోపణలు చేశారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

Bihar: బిహార్ సీఎం నితీశ్ కుమార్‭పై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ఓవైసీ

Bihar: బిహార్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బిహార్ వెళ్లిన ఓవైసీ.. ఆదివారం సీమాంచల్ ప్రాంతంలో (ఈశాన్య బిహార్‭లోని ఏడు జిల్లాల ప్రాంతం) ‘సీమాంచల్ అధికార యాత్ర’ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో నేను తప్పు చేశాను. కనీసం 50 మంది అభ్యర్థులనైనా నిలబెట్టి ఉండాల్సింది. కానీ ఈసారి ఆ తప్పు జరగదు. వీలైనంత ఎక్కువ మందిని పోటీలోకి దింపుతాం’’ అని అన్నారు.

Opposition Front: తమ ఫ్రంటులోకి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకోలేదో హింట్ ఇచ్చిన అఖిలేష్

‘‘ఈ రోడ్డు కాస్‭గంజ్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది’’ అని బిహార్ నుంచి పార్లమెంట్ అభ్యర్థులు కూడా గెలుస్తారనే ఉద్దేశంలో ఓవైసీ అన్నారు. ఇక బిహార్‭లో హార్స్ ట్రేడింగ్ గురించి నిప్పులు చెరిగారు. ‘‘ముందు మోదీతో నితీశ్ వివాహం జరిగింది (పొత్తు పెట్టుకున్నారనే ఉద్దేశంలో). తర్వాత తలాక్ ఇచ్చేశారు. ఇప్పుడు తేజశ్వీతో వివాహం జరిగింది. ఈ ఇద్దరు నేతలు (నితీశ్, తేజశ్వీ) మా ఎమ్మెల్యేలకు సైట్ కొడుతున్నారు’’ అని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుపొందింది.

Khalistan Row: ఇక చాలు.. పంజాబ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన సిక్కు సంఘాలు

అయితే నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అది కూడా జరగలేదు. తాజాగా మళ్లీ అవే ఆరోపణలు చేశారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.