Owaisi on Sharad Pawar: ఒకవేళ శరద్ పవార్ కనుక షాదాబ్ అయ్యుంటే.. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై విరుచుకుపడ్డ ఓవైసీ

తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఈ రెండు పార్టీల స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోతాయి

Owaisi on Sharad Pawar: ఒకవేళ శరద్ పవార్ కనుక షాదాబ్ అయ్యుంటే.. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై విరుచుకుపడ్డ ఓవైసీ

Asaduddin Owaisi's swipe at NCP backing BJP ally in Nagaland

Owaisi on Sharad Pawar: నాగాలాండ్‭లో బీజేపీ కూటమి ప్రభుత్వానికి శరాద్ పవార్ మద్దతు ఇవ్వడంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శరద్ పేరు కనుక షాదాబ్ అయ్యుంటే ‘బీజేపీ బీ-టీం’ అంటూ సెక్యూలర్లు అంతా కలిసి రాద్దాంతం చేసేవారని అన్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్‭డీపీపీ-బీజేపీ కూటమి విజయం సాధించింది. వాస్తవానికి వారికి ఎవరు మద్దతు ఇవ్వకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అయినప్పటికీ శరద్ పవార్ మద్దతు ఇచ్చారు. అయితే ఈ మద్దతును తాను సమర్ధించుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అంతటా శత్రువులమే, కానీ నాగాలాండ్ రాష్ట్రంలో కాదు’’ అని పవార్ అన్నారు.

Russia-Ukraine War:3 వారాల గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ మీద మరోసారి విరుచుకుపడ్డ రష్యా

ఆయన ప్రకారం.. దేశమంతటా బీజేపీ మీద పోరు చేస్తారు కానీ, నాగాలాండ్ రాష్ట్రంలో మాత్రం స్నేహం చేస్తారని కుండబద్దలు కొట్టారు. కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న పవార్.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటున్నారు. అలాంటిది ఉన్నట్టుండి బీజేపీతో చేతులు కలపడం గమనార్హం.

PM Modi: మోదీ స్టేడియంలో మోదీకి మోదీ ఫొటో బహుమానం

ఈ విషయమై ఓవైసీ స్పందిస్తూ ‘‘శరద్ కనుక షాదాబ్ అయ్యుంటే, అతడిని బీ-టీం అని, ఈ సెక్యూలర్లంతా నిందించేవారు. అంతేకాకుండా రాజకీయంగా అంటరానిగా చూసేవారు. నేనెప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వలేదు. కానీ బీజేపీకి ఎన్సీపీ రెండుసార్లు మద్దతు ఇచ్చింది. బహుశా ఇది చివరిసారి కూడా కాకపోవచ్చు. వాళ్ల పార్టీ నేత నవాబ్ మాలిక్‭ను బీజేపీ జైల్లో పెట్టింది. అయినా కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇది ముస్లింలకు వాళ్లు ఇచ్చే గౌరవం’’ అని ట్వీట్ చేశారు.

Maharashtra Budget: ‘పంచామృతాల బడ్జెట్’ ప్రవేశ పెట్టిన మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఈ రెండు పార్టీల స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోతాయి. అయితే చిత్రంగా మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో విపక్షం లేని ప్రభుత్వం ఏర్పడుతోంది.