Gehlot and Pilot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కుదిరిన ఒప్పందం

ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహా, ఇతర కుమ్ములాటలను నివారించేందుకే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు

Gehlot and Pilot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కుదిరిన ఒప్పందం

Rajasthan Congress: చాలా రోజులుగా ఉప్పునిప్పుగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఇరు నేతలు చేతులు కలిపారు. కలిసికట్టుగానే ఎన్నికల ప్రచారం చేసేందుకు అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలు ఈ ఇరు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఒప్పందాన్ని కుదిర్చారు.

#9YearsOfModiGovernment: నేటితో 9 ఏళ్ళ పాలనను పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం

ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జి జితేంద్ర సింగ్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు సహా, ఇతర కుమ్ములాటలను నివారించేందుకే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. నాలుగు గంటల పాటు సాగిన చర్చల అనంతరం ఎట్టకేలకు చేతులు కలిపేందుకు పైలట్, గెహ్లాట్ సరే అన్నారు.

Karnataka: సావర్కర్, హెగ్డేవార్ పాఠాలు తొలగిస్తారా? కర్ణాటక సీఎం ఏం అన్నారు?

కొద్ది రోజుల క్రితమే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సైతం గ్రూపు కుమ్ములాటలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధరామయ్యకు డీకే శివకుమార్‭కు మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగానే కొనసాగుతోంది. అయితే ఎన్నికల దృష్ట్యా వాటిని పక్కన పెట్టి సమిష్టిగా పోరాడారు. భారతీయ జనతా పార్టీని గద్దె దింపి అఖండ మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నారు. కర్ణాటక స్ట్రాటజీని ఫాలో అయితే రాజస్థాన్‭లో కూడా కాంగ్రెస్ పార్టీని సునాయాసంగా గెలిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

Chennai : స్నేహితుడి శవంపై కూర్చుని అఘోరా పూజలు.. సంచలనం రేపుతున్న సంఘటన

కర్ణాటక ఉదహారణను చెప్పే ఇరు నేతల్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. లేదంటే మొదటికే మోసం వస్తుందని చర్చించినట్లు సమాచారం. కాగా, సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ ‘‘అందరం కలిసే ఎన్నికల పోరు చేయాలని నిర్ణయించుకున్నాం. రాజస్థాన్ ఎన్నికల్లో కచ్చితంగా మేమే గెలుస్తాం. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఎలాంటి షరతులు లేకుండా కలిసి పోరాడేందుకు అంగీకరించారు’’ అని అన్నారు.