రమేశ్ హాస్పటల్స్ గ్రూప్‌లో రూ.250 కోట్ల పెట్టుబడులు, ఆస్టర్ కంపెనీ ఎక్కడుంది? ఎవరిది?

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 01:12 PM IST
రమేశ్ హాస్పటల్స్ గ్రూప్‌లో రూ.250 కోట్ల పెట్టుబడులు, ఆస్టర్ కంపెనీ ఎక్కడుంది? ఎవరిది?

ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆస్టర్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, రమేష్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీకి 51శాతం వాటా ఉన్నట్టు తేల్చారు. రమేష్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీ సుమారు రూ.250 కోట్ల పెట్టబడులు పెట్టినట్లు దర్యాఫ్తులో తేలింది. కేసులో మరిన్ని కోణాల్లో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు పోలీసులు. ఒంగోలు, గుంటూరు, విజయవాడలోని ఆసుపత్రుల్లో షేర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు.



ఆస్టర్ కంపెనీ ఎవరిది? రమేష్ హాస్పిటల్స్ తో ఏంటి సంబంధం?
స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి వారం రోజులు అవుతోంది. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది కొవిడ్ పేషెంట్లు చనిపోయారు. దీనిపై పోలీసులు దర్యాఫ్తుని స్పీడప్ చేశారు. రమేష్ హాస్పిటల్స్ లో ఆస్టర్ కంపెనీకి 51శాతం వాటాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆస్టర్ కంపెనీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్టర్ కంపెనీ ఎక్కడుంది? అది ఎవరిది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఆస్టర్ కంపెనీకి, రమేష్ హాస్పిటల్స్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబుకి పోలీసులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని చెప్పారు.



ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని విద్యుత్ లోపాలు సరి చేయలేదు:
స్వర్ణ ప్యాలెస్ లో ఆగస్టు 9వ తేదీన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు మరణించారు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ జరిపిన దర్యాఫ్తు బృందం 4 పేజీల రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసింది. రమేష్ హాస్పిటల్స్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే.. అగ్నిప్రమాదం జరిగిందని రిపోర్టులో చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు విషయమై రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలు ఎంవోయూ కుదుర్చుకున్నాయని రిపోర్టులో తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నాయని, ఆ విషయం రెండు యాజమాన్యాలకు తెలుసని, కానీ వాటిని సరిచేయటానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని దానిని పట్టించుకోలేదని తేల్చారు.



విద్యుత్ లోపాలు ఉన్నాయని తెలిసినా కొవిడ్ కేర్ సెంటర్ తెరిచారు:
దాని వల్లనే… అగ్నిప్రమాదం జరిగిందన్నారు. లోపాలు ఉన్నాయని తెలిసినా రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ ను తెరిచిందని, ఫలితంగా 10మంది చనిపోయారని, 20మంది గాయపడ్డారని రిపోర్ట్ లో తెలిపారు. విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో లోపాలు ఉన్నాయని తెలిసినా కోవిడ్ కేర్ సెంటర్ ను నడిపిన రమేష్ హాస్పిటల్స్ దే బాద్యతని రిమాండ్ రిపోర్ట్ తేల్చింది. ఎమ్ఓయూలు కుదర్చుకోవడంలో చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావు, జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్ పాత్ర ఉందని తేల్చారు. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించటానికి ఎలాంటి భద్రత చర్యలు తీసుకొలేదని, ముగ్గురు నిందితులు బయటకు వస్తే… ఆధారాలను తారుమారు చేయడంతో పాటు పరారైయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదానికి రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలదే బాధ్యతగా నిర్ధారించారు.